పోలీసుల తనిఖీలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రం మంచిర్యాలలో మంగళవారం అర్ధరాత్రి ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఆపరేషన్ ఛభుత్రలో భాగంగా ఐదుగురు సీఐలతో ఐదు బృందాలు ఏర్పాటు చేసి ప్రధాన చౌరస్తాలు, రహదారులపై అకారణంగా తిరుగుతున్న వారిపై కొరఢా ఝలిపించారు. మద్యం సేవించి, ట్రిపుల్ రైడింగ్‌తో ద్విచక్రవాహనాలపై వె ళ్తున్న సుమారు 100మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. నమ్మదగిన సమాచారం లేకుండా 11గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ ప్రమోద్‌రావు, మహిళా పోలీస్ స్టేషపన్ సీఐ నరేష్‌కుమార్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, బెల్లంపల్లి సీఐ అబ్జల్ ఖాన్, ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment