డీలర్లకు ముగిసిన శిక్షణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో నూ తనంగా నమోదైన వ్యవసాయ డీలర్లకు హా జీపూర్ మండలం గుడిపేట రైతువేదికలో 48 వారాలపాటు ఇచ్చిన శిక్షణ బుధవారం పూర్తయింది. డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్(డీఏఈఎస్‌ఐ) ఆధ్వర్యంలో శిక్షణ ఏర్పాటు చే యగా విత్తన, ఎరువులు, పురుగుల మందుల చ ట్టం మేరకు క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలన, వ్యా ధుల నిర్దారణ, నివారణ చర్యలు, పంటల ఉత్పత్తి, ఉత్పాదకతని పెంచేందుకు అవసరమైన శాసీ్త్రయ విధానాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న డీలర్లకు పరీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణులకు జిల్లా వ్యవసాయాధికారి కల్పన సర్టిఫికెట్లు అందజేశారు. హాజీపూర్ వ్యవసాయాధికారి కృష్ణ, డీఏఈఎస్‌ఐ నిర్వాహకులు శశిధర్, డీలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment