బకాయిలు చెల్లించని మిల్లర్లపై చర్యలు
జైపూర్: ప్రభుత్వానికి రైసుమిల్లు యజమానులు ధాన్యం పెండింగ్ బకాయిలు చెల్లించని పక్షంలో చ ట్టపరమైన చర్యలు తప్పవని సివిల్ సప్లయి టా్ స్కఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్ హెచ్చరించారు. మంచి ర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో బాలాజీ రైసుమిల్లు, ముదిగుంటలో బీఎస్‌వై రా రైసు మిల్లులను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చే శారు. బాలాజీ రైసుమిల్లు నిర్వాహకులు 2023–24 ఖరీఫ్‌లో 2,305 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయిలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని, దీని విలువ రూ.5.5కోట్లు అని తెలిపారు. బీఎస్‌వై రా రైస్‌మిల్లు 2022–23 రబీ సీజన్లో 3,858 మెట్రిక్‌టన్నుల ధాన్యం, 2023–24 ఖరీఫ్ సిజన్లో 2,687మెట్రిక్ టన్నుల ధాన్యం చెల్లించాల్సి ఉందని, దీని విలువ సుమారు రూ.19కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. రెండు రైసుమిల్లుల నిర్వాహకులతో అంగీకార ప త్రం రాయించుకున్నట్లుగా తెలిపారు. ఈ నెల 31 లోగా పెండింగ్ బకాయిలు చెల్లించని పక్షంలో చట్ట పరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అసిస్టెంట్ సివిల్ సప్లయి అధికారి వేణుగోపాల్, సివిల్ సప్లయి డిప్యూటీ తహసీల్దార్ స్రవంతి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సుదర్శన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment