చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
భీమిని: ట్రాక్టర్‌తో వ్యక్తి పొలంలో జంబుకొడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందా డు. కన్నెపల్లి మండలం మాడవెల్లి పంచాయతీ పరి ధి బొత్తపల్లికి చెందిన లట్కూరి రవి (32) ట్రాక్టర్‌తో ఈనెల 20న చేలలో జంబు కొడుతుండగా వి ద్యుత్ తీగలు ఆయన ముఖంపై పడి గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబీకులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి పంపించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం పోస్టుమార్టం ని ర్వహించారు. అనంతరం కుటుంబీకులు డెడ్‌బాడీతో కన్నెపల్లి సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని, తమకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించబో మని వారు స్పష్టం చేశారు. విషయం తె లుసుకున్న తాండూర్ సీఐ కుమారస్వామి, కన్నెపల్లి ఎస్సై గంగారాం, విద్యుత్ అధికారులు అక్కడికి వె ళ్లారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీతో ధర్నా విరమించారు. భార్య లావణ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment