అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
● కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం: ప్రభుత్వం జనవరి 26 నుంచి అమలు చేసే రైతు భరోసా, రేషన్‌కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ఫలా లు జిల్లాలోని ఆర్హుందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భీమారం మండలం ఆరెపల్లి, ఆర్కెపల్లి, భీమారం గ్రామాల్లో జరుగుతున్న లబ్ధిదారుల గుర్తింపు సర్వేను ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా పథకంలో జిల్లాలో సాగు యోగ్యం కాని రాళ్లు, గుట్టలు, నివాస గృహాలు, వెంచర్లు, ప్రభుత్వం సేకరించిన భూములు, చెరువులు, కాలువలు, రహదారులు, రైల్వే లైన్ కోసం కేటాయించిన భూములను తొలగిస్తున్నట్లు తెలిపారు. సర్వే సిబ్బంది ఈమేరకు జాబితా రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామన్నారు. అర్హుల జాబితాలో పేర్లు లేనివారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలను గ్రామ సభల్లో చదివి వినిపించడం జరుగుతుందని తెలిపారు. అర్హత ఉన్నవారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment