ఇందన్‌పల్లి రేంజ్‌లో పర్యటించిన ఐఎఫ్‌ఎస్ అధికారి
జన్నారం: కవ్వాల్ టైగర్‌జోన్ జన్నారం అటవీ డివిజన్ ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌లో ఆదివారం ఐఎఫ్‌ఎస్ అధికారి కుమారి చిన్న పర్యటించారు. రేంజ్ పరిధిలోని కామన్‌పల్లి వాచ్‌టవర్, మైసమ్మ కుంట, ఘనిషెట్టికుంట, బర్తన్‌పేట్ బేస్‌క్యాంపు ప్రాంతాల్లో పర్యటించారు. గడ్డిక్షేత్రాలు, నీటి కుంటలను పరిశీలించి వాటి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలోని వన్యప్రాణులు, పక్షులను పరిశీలించి మురిసిపోయారు. అడవులు, గడ్డిక్షేత్రాలు, నీటికుంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ తదితర అంశాలను రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ వివరించారు. వారివెంట సెక్షన్ అధికారి హన్మంతరావు, బీట్ అధికారులు రుబీనా, పోచయ్య, ముజీబొద్దీన్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment