ఆర్టీసీ కార్మికులకు భోజనం
మంచిర్యాల అర్బన్: సంక్రాంతి పండుగ వేళ తిరుగు ప్రయాణంలో రద్దీ నియంత్రణకు బ స్సులు నడుపుతున్న కార్మికులకు ఆర్టీసీ యా జమాన్యం భోజనం, తాగునీరు సరఫరా చే స్తోంది. ఆదివారం మంచిర్యాల డిపోలో విధులు నిర్వహించే 200 మంది కార్మికులకు బాక్స్ భోజనం, తాగునీరు డీఎం జనార్దన్ అందజేశారు. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు పండుగ వేళ సమయానికి భోజనం దొరకక ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి నాణ్యమైన భోజనం(ప్లాస్టిక్ బాక్స్ ఫ్యాకింగ్‌తో కూడిన భో జనం) తాగునీరు పంపిణీ చేశామని డీఎం జనార్దన్ తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ దేవపాల, ఉద్యోగులు మహేందర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment