పదవీకాలం ముగిసినా ప్రజల్లోనే ఉండాలి
మంచిర్యాలటౌన్: పదవీకాలం ముగిసినా ప్రజలకు దగ్గరగా ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు మున్సిపల్ పాలకవర్గాలకు సూచించారు. ఈ నెల 26తో మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. దీంతో మంచిర్యాల, లక్సెట్టిపేట, నస్పూర్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులను డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఆదివారం సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల మున్సి పల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్ల మహేశ్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment