అడవిపంది దాడిలో రైతుకు గాయాలు
కై లాస్‌నగర్: బేల మండలం సదల్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హస్నాపూర్‌లో పొలం పనులు చేస్తున్న యువరైతు ఆడే కిషన్‌పై అడవిపంది దాడి చేసి గాయపర్చింది. పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా వెనుక నుంచి వచ్చి దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాఽధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి బాధితుడిని పరామర్శించారు.
కోతిని తప్పించబోయి.. చెట్టును ఢీకొట్టిన కారు
● ఐదుగురికి స్వల్పగాయాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి వెళ్తున్న క్రమంలో పస్రా–తాడ్వాయి మధ్యలో ఓ కారు రోడ్డుపైకి వచ్చిన కోతిని తప్పించే క్రమంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్ బంధువులతో కలిసి భద్రాచలానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. మేడారంలోని వనదేవతల దర్శనం నిమిత్తం వెళ్తుండగా పస్రా– తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపైకి వచ్చిన కోతిని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. కారులో ఉన్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఏటూరునాగారం నుంచి ములుగు వెళ్తున్న పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ రాంపతి వారిని గమనించి ఆగారు. 108కు సమాచారం అందించి గాయపడిన వారిని తన వాహనంలో పస్రా చెక్‌పోస్టు వరకు తీసుకెళ్లారు. అక్కడికి అంబులెన్స్ రాగా, ములుగు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం రాంపతి మరో వాహనాన్ని పిలిపించి డీఈతోపాటు బంధువులను ఆదిలాబాద్‌కు తరలించి మానవత్వం చాటుకున్నారు.
గాయపడిన వ్యక్తికి చికిత్స చేస్తున్న 108 సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment