దారి సమస్య తీర్చాలని వినతి
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ 26వ వార్డు అశోక్ నగర్ బస్తీ వాసుల దారి సమస్య తీర్చాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం అజయ్‌కుమార్ జైన్‌ను కోరారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ఆయనను కలిసి రైల్వేలైన్ నుండి అశోక్ నగర్ బస్తీకి రహదారి సమస్య ఉందని వివరించారు. ఆ సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, నాయకులు ఖాజా, చోటే, పోశం, బస్తీవాసులు సలీం, నసీర్, జాఫర్, బద్రొద్దీన్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 15న జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి
మంచిర్యాలఅర్బన్: సూర్‌వీర్ సేవాలాల్ మహరాజ్ జయంతి(ఫిబ్రవరి 15)ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని గిరిజన విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు ఇందల్ రాథోడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ జయంతి దేశవ్యాప్తంగా జరుపుకునేందుకు వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించాలని, జాతీయస్థాయిలో బంజార ప్రత్యే క కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ నాయకులు లచ్చన్న, రఘునందన్, శ్రీనివాస్, జీవీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి ఈశ్వర్, చరణ్‌నా యక్, నరేష్, రవీందర్‌నాయక్, వంశీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment