ఆకట్టుకున్న బొమ్మల కొలువు
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్‌లోని బంగ్లా ఏరియాలో గల ఇల్లందు క్లబ్‌లో లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు చూపరులను ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అధికారుల సతీమణులు బొమ్ముల కొలువును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) డీ సత్యనారాయణరావు సతీమణి హరిణి, డైరెక్టర్(పీపీ) జీ వెంకటేశ్వర్‌రెడ్డి సతీమణి సునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తిరుమల వేంకటేశ్వర ఆలయంసెట్టింగ్‌లో శ్రీనివాస కల్యాణాన్ని తలపించే ఆకృతులు, బొమ్మలను సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం ఎల్వీ సూర్యనారాయణ సతీమణి మాలతి, అధికారుల సతీమణులు లక్ష్మీ, స్వరూప, ఉమా, సుధా, అనిత, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment