ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
నిర్మల్‌రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ సంఘం తరపున పోటీ చేస్తున్న వంగ మహేందర్‌రెడ్డిని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ కోసం కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు నూతన హెల్త్‌స్కీమ్, పెండింగ్‌లో ఉన్న డీఏతో పాటు 2003 డీఎస్సీ ద్వారా ఎంపికై న ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప చేసేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఉపాధ్యాయుల సమ్మేళనంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఏనుగు అశోక్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి రమణారావు, భూమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment