ఎకై ్సజ్ అధికారుల స్పెషల్ డ్రైవ్
బెల్లంపల్లి: బెల్లంపల్లి ఎకై ్సజ్, ప్రొహిబిషన్ సర్కిల్ కార్యాలయం పరిధిలోని గ్రామాల్లో మంగళవారం ఎకై ్సజ్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నాటుసారా తయారీ నిర్మూలన లక్ష్యంగా మందమర్రి మండలం పులిమడుగు, కాసిపేట మండలం మామిడి గూడెం గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి 16 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. పులిమడుగుకు చెందిన కుస్సోత్ కిషన్, గుగ్లోత్ రాజు, మామిడిగూడెం గ్రామానికి చెందిన నగావత్ నాగమ్మపై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి ఎకై ్సజ్ సీఐ జె.ఇంద్రప్రసాద్ తెలిపారు. దాడుల్లో మంచిర్యాల డీటీఎఫ్ సీఐ ఎస్.సమ్మయ్య, ఎకై ్సజ్ ఎస్సైలు ఎం.వెంకటేష్, మనీషా రాథోడ్, సిబ్బంది సురేష్, అజయ్, గణేశ్, విజయ, రవీందర్, లక్ష్మణ్, సాగర్, రాజయ్య, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment