కొను‘గోల్’కు దూరం!
● ముగిసిన ధాన్యం కొనుగోళ్లు
● గతేడాది కంటే తక్కువే..
ప్రతీ ధాన్యం గింజ
కొనుగోలు చేశాం..
జిల్లాలో ధాన్యం సేకర ణకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టాం. డి సెంబర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోటెత్తింది. వాతావరణ పరిస్థితు వల్ల తేమ ఎక్కువగా రావడం, వర్షాలతో కొంత రైతులు ఇబ్బంది పడ్డా తీ సుక వచ్చిన ప్రతీ ధాన్యం గింజ సేకరించాం.
– జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్,
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన ధాన్యం సేకరణ ముగిసింది. ఈ నెల 13నుంచి కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయగా.. కొనుగోలు కేంద్రాలకు గత ఏడాది కంటే ఈసారి ధాన్యం తక్కువగా వచ్చింది. 3.20లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి గాను లక్ష మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. ఇందులో దొడ్డు రకం 58,383 మెట్రిక్ టన్నులు, సన్నరకం 43,100 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 18,108 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. రూ.235,44,04,576 నగదు రైతులకు అందాల్సి ఉండగా.. ఇప్పటివరకు 17,640 మందికి రూ.232,49,82,504 నగదు ఖాతాల్లో జమ అయింది. జిల్లా వ్యాప్తంగా 319 కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని 30 మిల్లులకు తరలించారు.
వేర్వేరు కేంద్రాలు..
జిల్లాలో అక్టోబర్ 17నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఆశించిన మేరకు ధా న్యం రాలేదు. ఆలస్యంగా కురిసిన భారీ వర్షాల కా రణంగా వరినాట్లు ఆలస్యం అయ్యాయి. నవంబర్ నుంచి దిగుబడి రావాల్సిన పంట డిసెంబర్‌లో కో తకు వచ్చింది. ఈ ఏడాది దొడ్డు రకం ధాన్యంతో పాటు సన్నరకం ధాన్యం సేకరణకు వేర్వేరుగా కొ నుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సన్నరకానికి ప్రభుత్వం బోనస్ చెల్లించడంతో రైతులు కొనుగో లు కేంద్రాల్లో ఎక్కువగా విక్రయించారు. ఖరీఫ్‌లో 1.60 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా 3.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధి కారులు అంచనా వేశారు. రైతుల అవసరాలు, విత్త న కంపెనీలకు ధాన్యం పోను కొనుగోలు కేంద్రాల్లో 3.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ లక్ష్యంలో 35 మాత్రమే కేంద్రాలకు వచ్చింది. గతేడాది ఖరీఫ్‌లో కొనుగోలు కేంద్రాల్లో 1,39,663 మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించారు. ఈ ఏడాది 1.01 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే వచ్చింది. ఏ గ్రేడు రకానికి క్వింటాల్‌కు రూ.2320 కాగా, సాధారణ రకానికి రూ.2305 ధరతో కొనుగోలు చేశారు. సన్నాలకు అదనంగా 500 ధరతో కలిసి రూ.2,820 లభించింది. సన్నరకం బియ్యానికి బయట మార్కెట్‌లో ఎక్కువగా డిమాండ్ ఉండడంతో మిల్లర్లు నేరుగా రైతుల వద్దకు వెళ్లి మద్దతు, బోనస్ ధరలకు రూ. వంద రెండు వందలు ఎక్కువ చెల్లించి కొనుగోలు చేశారు. కొందరు రైతులు నేరుగా మిల్లింగ్ చేసి బియ్యాన్ని మార్కెటింగ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు, తేమ తదితర ఇబ్బందులు, మార్కెట్ డిమాండ్‌తో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాక తగ్గినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment