వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు
● మంద కృష్ణమాదిగ
కాసిపేట: ఎస్సీ వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మూల్యం చెల్లించక తప్పదని, ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి కుటుంబాన్ని రాజకీయంగా అడ్రస్ లేకుండా చేస్తామని మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. మండలంలోని సోమగూడెంకు చెందిన ఎంఎస్‌పీ జిల్లా ఇంచార్జీ కల్వల శరత్‌మాదిగ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అమలుకు మరో ఉద్యమం చేయాల్సిన అవసరం లేదని, మాల స్వార్థపరులు కల్పిస్తున్న అడ్డంకుల వల్ల మాదిగ బిడ్డలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేశారని అన్నారు. మాలల ఒత్తిడి ఉన్నా వర్గీకరణకు ఇచ్చిన మాట అమలు చేసేందుకు చిత్తశుద్ధితో ముందుకు వస్తారని అశిస్తున్నట్లు తెలిపారు. వర్గీకరణ అమలు, జరిగే కుట్రలు ఎదుర్కొనేందుకు ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించే వేల గొంతులు–లక్షల డప్పులు కార్యక్రమం విజయవంతానికి ప్రతీ కుటుంబం నుంచి ఒకరు రావాలని, వెంట డప్పులు తెచ్చుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఆర్‌పీఎస్ ఉమ్మడి జిల్లా ఇంచార్జీ బుర్రి సతీష్‌మాదిగ, జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య, జిలకర శంకర్, దాసరి రాంచందర్, రామగిరి మహేష్ పాల్గొన్నారు.
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
కోటపల్లి: మండలంలోని లింగన్నపేట, మల్లంపేట గ్రామాల్లో గురువారం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ మాట్లాడుతూ రాజ్యాంగం గొప్పతనం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏవిధంగా అవమానించిందో గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు కొండపాక చారి, మండల అధ్యక్షుడు మంత్రి రామయ్య, మండల ఉపాధ్యక్షుడు పున్నం చంద్, నాయకులు నాగేశ్వర్‌రావు, లచ్చన్న, సంతోశ్, తిరుపతి, ఆశోక్, శ్రీకాంత్, నర్సింలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment