బాలి‘కల’కు రెక్కలిద్దాం..!
పంచ్ కొడితే పతకమే..
మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణానికి చెందిన కార్మెల్ స్కూల్ పదో తరగతి విద్యార్థిని క్రితి అగర్వాల్ బాక్సింగ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తోంది. 7వ తరగతిలో ఉన్నప్పుడే బాక్సింగ్‌పై ఉన్న మక్కువతో శిక్షణ ప్రారంభించింది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఖేలో ఇండియా ద్వారా అందిస్తున్న బాక్సింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ పతకాలు సాధిస్తోంది. మూడేళ్లలో మూడుసార్లు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించింది. జాతీయస్థాయిలోనూ సబ్ జూనియర్ కేటగిరీలో రెండుసార్లు క్వార్టర్ ఫైనల్ వరకు చేరింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment