పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలటౌన్/రామకృష్ణాపూర్: ప్రభుత్వ పథకాలు అర్హులకే అందేలా అధికారులు లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంచిర్యాలలోని 17, 18వ వార్డుల్లో, క్యాతనపల్లి మున్సిపాల్టీ 9వ వార్డులో గురువారం నిర్వహించిన వార్డుసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాబితాలో వివరాలు రాని వారు దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్ కార్డుల జారీలో నిబంధనలు పాటిస్తూ అర్హులైన అభ్యర్థుల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తామని, స్వంత స్థలం కలిగి ఉండి ఇల్లులేని వారిని గుర్తించి వర్తింపజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మందమర్రి తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, వైస్ చైర్మన్ సాగర్‌రెడ్డి, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, కౌన్సిలర్లు పూదరి సునిత తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పరిహారం అందేలా చర్యలు
మంచిర్యాలటౌన్: జాతీయ రహదారి 163జీ నిర్మాణంలో భూములు కోల్పోయిన అర్హులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల ఆర్డీ వో కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన బాధితుల వివరాలను ఆర్డీవో శ్రీనివాస్‌రావుతో కలిసి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment