పరీక్షా పే చర్చాలో విద్యార్థులకు క్విజ్ పోటీలు
మంచిర్యాలఅర్బన్: స్థానిక కేంద్రీయ విద్యాలయంలో గురువారం పరీక్షా పే చర్చా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రతీ పాఠశాల నుంచి ఐదుగురు చొప్పున వంద మందికి అవకాశం కల్పించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ఐదుగురు స్వాతంత్య్ర సమరయోధుల వీడియోలను విద్యార్థుల అవగాహన కోసం ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అల్లూరి సీతారామరాజుపై పలు విషయాలతో రూపొందించిన పశ్నపత్రం అందించగా సమాధానాలు రాశారు. కార్మెల్ హైస్కూల్ (సీబీఎస్‌ఈ) విద్యార్థి లక్ష్మీ వినీషా(ప్రథమ), ట్రినిటీ హైస్కల్‌కు విద్యార్థి షణ్ముఖి, కేంద్రీయ విద్యాలయానికి చెందిన సాహితీ ద్వితీయ స్థానంలో నిలిచారు. ట్రినిటీ హైస్కూల్ అభిరామ్, ఉషోదయ హైస్కూల్‌కు చెందిన మహశ్రీ, కేంద్రీయ విద్యాలయానికి చెందిన రామ్ తృతీయ స్థానం సాధించారు. విజేతలకు ప్రశంసాపత్రాలతో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, సెక్టోరల్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment