![నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mcl78-340059_mr-1738869973-0.jpg.webp?itok=IbpVvQ_F)
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
మంచిర్యాలటౌన్: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, జెడ్పీ సీఈవో గణపతి, ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకంలోని మంచిర్యాల, నస్పూరులో వార్డులకు అవసరమైన మేరకు తాగునీరు అందించాలని, పైప్‌లైన్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసి అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేసి వేసవికాలంలో నీరందించేందుకు సిద్ధం చేయాలని అన్నారు. గత నాలుగేళ్లుగా జిల్లాలో నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి నివేదిక అందించాలన్నారు.
ప్రతీ రోజు నీటి సరఫరా
బెల్లంపల్లి: ప్రతీ ఇంటికి ప్రతీరోజు తాగునీరు సరఫ రా చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కా ర్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సి పాల్టీలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, అంతర్గత రహదారులు, మురికి నీటి కాలువ నిర్వహణ సక్రమంగా చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ జ్యోత్స్న, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించండి
నెన్నెల: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించా లని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువా రం నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పీహెచ్‌సీ పరిసరాలు, వైద్య సదుపాయాలు, ఆస్పత్రి రిజిష్టర్‌ను పరిశీలించారు. వైద్యులతో మా ట్లాడి సేవలు, సీజనల్ వ్యాధులపై ఆరా తీశారు. ల్యాబ్ టెక్నీషియన్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే నియమిస్తామని చెప్పారు. అనంతరం నెన్నెల, దుబ్బపల్లి, గన్‌పూర్, జోగాపూర్ పాఠశాలలను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎంపీడీఓ దేవేందర్‌రెడ్డి, ఏపీఓ నరేష్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
అధికారులతో సమీక్ష సమావేశం
Comments
Please login to add a commentAdd a comment