![ఆలోచన శక్తి పెంచుకోవాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06cnr76-340071_mr-1738869974-0.jpg.webp?itok=KHUuA06q)
ఆలోచన శక్తి పెంచుకోవాలి
జైపూర్: విద్యార్థులు ఆలోచన శక్తి పెంచుకోవాలని జిల్లా సైన్స్ అధికారి మధుబాబు తెలి పారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విజ్ఞాన మొబైల్ సైన్స్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు వివిధ రకాల సైన్స్ కృత్యాలపై ఆయన వివరించారు. విద్యార్థులు ప్రకృతిని చూసి విజ్ఞానాన్ని పెంచుకోవాలని తెలిపారు. విద్యార్థుల భాగస్వామ్యంతో 30కి పైగా చేసిన కృత్యాలు ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేకాధికారి ఫణిబాల, విజ్ఞాన ల్యాబ్ ఉపాధ్యాయులు లక్ష్మణ్, భారతిదేవి, పద్మ, మంజుల, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment