![సహాయంలో ముందున్న భరోసా కేంద్రాలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mcl276-340143_mr-1738869973-0.jpg.webp?itok=5gi9LNn3)
సహాయంలో ముందున్న భరోసా కేంద్రాలు
నస్పూర్: మహిళలకు సహాయం అందించడంలో భరోసా కేంద్రాలు ముందున్నాయని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. పట్టణంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా భరోసా కేంద్రం వద్ద సిబ్బందితో కలిసి గురువారం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, బాలికలకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని అన్నారు. బాధిత మహిళలకు కౌన్సెలింగ్, వైద్యం, న్యాయ సహాయం అందించడంలో భరోసా కేంద్రం ముందుందని తెలిపారు. కొందరు ఫిర్యాదుకు వెనుకంజ వేస్తున్నా రని, వారికి ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతు న్నాయని అన్నారు. భరోసా కేంద్రంలో 17 కేసులు వచ్చాయని, అందులో 13 పోక్సో, 4 అత్యాచారం కేసులు ఉన్నాయని, 57 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ నరేశ్‌కుమార్, సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్, షీటీఎం ఎస్సై హైమ, మంచిర్యాల ఎస్సై వినత, భరోసా సిబ్బంది విజయ, నవ్యకృష్ణ, ప్రమీల, పుష్పలత, ప్రియాంక, ప్రమీల, రజిత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment