![గీతకార్మికులకు రక్షణగా కాటమయ్య రక్ష కిట్లు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06knp77-340068_mr-1738869974-0.jpg.webp?itok=kUPkXfnj)
గీతకార్మికులకు రక్షణగా కాటమయ్య రక్ష కిట్లు
జన్నారం: గీత కార్మికులకు ప్రభుత్వం అందించే కాటమయ్య రక్ష కిట్లు ఎంతో రక్షణగా ఉంటాయని కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్ రాష్ట్ర కో ఆ ర్డినేటర్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మండలంలోని బాదంపల్లి గ్రా మంలో ఇందన్‌పల్లి, కిష్టాపూర్, జన్నారం, పొ నకల్ గ్రామాల గీత కార్మికులకు లక్షెట్టిపేట ఎకై ్సజ్ సీఐ సమ్మయ్య ఆధ్వర్యంలో కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్లతో ప్రత్యేక శిక్షకులతో శిక్షణ ఇ ప్పించారు. ఆయా గ్రామాలకు చెందిన వంద మంది గీతకార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటి చెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడే ప్రమాదం జరగకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్సై మౌనిక, బాదంపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు నాయిని సత్యాగౌడ్, మండల గౌడ సంఘం అధ్యక్షుడు మూల భాస్కర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పోడేటి రవిగౌడ్, మోకుదెబ్బ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment