![‘స్థానిక’ ఏర్పాట్లు వేగవంతం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mcl01-605227_mr-1738869972-0.jpg.webp?itok=mNgX3Yvh)
‘స్థానిక’ ఏర్పాట్లు వేగవంతం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్ని కల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో అధికారులు జిల్లాలో ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈ నెల 15లోపు నోటిఫికేషన్ వె లువడే అవకాశం ఉండడంతో అంతా సిద్ధం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలపడంతో ఆ మేరకు ఎంపీటీసీ స్థానాల పునర్విభజన పూర్తి చేశారు. తాజాగా జిల్లాలో 129 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, జెడ్పీటీసీ స్థా నాలు 16 ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నా యకులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. తమ పరిధిలో ఉన్న స్థానాల రిజర్వేషన్లు ఖరారైతే రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి సిద్ధం చే సే నామినేషన్ పత్రాలు, పోలింగ్, ఏజెంట్ల గుర్తింపు కార్డులు తదితర సామగ్రి జిల్లాలోని మండల పరిషత్‌లకు చేరవేస్తున్నారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు సిద్ధమయ్యాయి. బ్యాలెట్ బాక్సులతో సహా పేపర్లు, గుర్తులు ముద్రించినవి తదితర సామగ్రిని అందుబాటులో ఉంచారు. కొత్త ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు.
నాయకుల ప్రయత్నాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్థానిక నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేష న్లు ఖరారైతే పోటీలో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా మండలాలు, గ్రా మాల పరిఽధిలో ఏ రిజర్వేషన్ వస్తే ఎవరు పోటీలో ఉంటారనే చర్చలు నడుస్తున్నాయి. అంతేగాక పార్టీ గుర్తుపై జరిగే మండల, పరిషత్ ఎన్నికలు కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులతోనూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ అ నుకూలిస్తే తమకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే కో రుతున్నారు. ఇప్పటికే కొందరు గ్రామాల్లో ఓట్లు కూడగట్టుకునేందుకు మద్దతు పొందే పనులు చే స్తున్నారు. మాజీ ప్రజాప్రతినిధులతోపాటు గతంలో అవకాశం రాక ఎదురుచూస్తున్న వారంతా ఈసారి మళ్లీ బరిలో దిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ
ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి చాలామందికి ఉన్నప్పటికీ రిజర్వేషన్లు ఎలా ఉంటాయోననే ఉ త్కంఠ అందరిలో నెలకొంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ, ఎస్టీ, ఓసీ రిజర్వేషన్లలో మార్పులతో ఏ స్థానానికి ఎక్కడ ఎవరికి అవకాశం దక్కుతుందోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జనరల్, మహిళా, రిజర్వేషన్ల కోటా ఖరారు అయితే నే పోటీకి మార్గం సుగమం కానుంది. ఈ నేపథ్యంలో గత రిజర్వేషన్లు, గ్రామాల్లో ఉన్న జనా భా, రొటేషన్ పద్ధతి తదితరవన్నీ అంచనాతో లె క్కలు వేసుకుంటున్నారు. అధికారికంగా వెలువ డే వరకు ఆయా స్థానాలకు ఏ వర్గాలకు అవకాశం కలుగుతుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది.
అంతా సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం
రిజర్వేషన్ల ఖరారుపై అందరిలోనూ ఉత్కంఠ
Comments
Please login to add a commentAdd a comment