![రామాయంపేటలో టమాటా పంట సాగు - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/6/04mdk01a-350071_mr.jpg.webp?itok=VnMLoouY)
రామాయంపేటలో టమాటా పంట సాగు
● ఎండ ఎఫెక్ట్‌తో రాలిన కాత, పూత ● భారీగా పడిపోయిన దిగుబడి ● ఆకాశాన్నంటుతున్న ధరలు
కూరగాయల ధరలు
కిలో.. (రూపాయలలో)
టమాటా 120
పచ్చిమిర్చి 120
బిర్నీస్ 160
బీరకాయ 100
చిక్కుడు 100
దొండకాయ 100
కాకర 60
క్యాబేజీ 40
కాలీఫ్లవర్ 80
చామగడ్డ 60
బీట్‌రూట్ 60
మెదక్‌జోన్: ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయల పంటలపై తీవ్రంగా పడింది. ఎండవేడికి కాత, పూత రాలి దిగుబడి తగ్గిందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రోజుకు సుమారు 35 నుంచి 40 టన్నుల కూరగాయలు అవసరం కాగా కేవలం 5 టన్నులు మాత్రమే లభిస్తుండడంతో దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
● జిల్లాలోని ఆయా మండలాల్లో సుమారు వేయి ఎకరాల్లో టమాటా, పచ్చిమిర్చితో పాటు ఇతర కూరగాయలు సాగయ్యాయి.
● వేసవిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కాత, పూత రాలిపోయాయని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు.
● మార్కెట్‌లో పెరిగిన కూరగాయల ధరలు చూసి సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
● నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంటికి వారం రోజులకు సరిపడా కూరగాయలు కొనాలంటే రూ.1,000 వెచ్చించాల్సి వస్తోంది.
● సుమారు వేయి ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో కూరగాయల కొరత ఏర్పడి ఇతర చోట్ల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
● కూరగాయల సాగు పెంచేందుకు ప్రభుత్వం 90శాతం సబ్సిడీపై రైతులకు విత్తనాలను
అందిస్తోంది.
● గతేడాది జిల్లాలో 125 ఎకరాలకు సరిపడా నారుమడులను రైతులకు అందించారు.
● ఈసారి పన్నెండున్నర ఎకరాలకు మాత్రమే సరఫరా చేశారు. దీంతో కూరగాయల సాగు తగ్గడానికి ఇది కూడా ఓ కారణమైంది.
● జిల్లాలో 7,67,248 మంది జనాభాకు ప్రతీ రోజు 35 నుంచి 40 టన్నుల కూరగాయలు అవసరం ఉంటాయి.
● కాగా ప్రభుత్వం కూరగాయల సాగుకు ప్రోత్సాహకం నిలిపివేయడం, పర్యావరణ పరిస్థితుల కారణంగా దిగుబడిపై ప్రభావం పడుతోంది.
● అన్ని మండలాల్లో కలిపి కేవలం ఐదు టన్నుల కూరగాయలు పండుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన సుమారు 30 టన్నుల కూరగాయలు అవసరం ఉంటాయి.
● ఇదే అదునుగా భావించిన వ్యాపారులు, దళారులు ధరలను భారీగా పెంచి అందినకాడికి దండుకుంటున్నారు.
![మెదక్ మార్కెట్‌లో కూరగాయల విక్రయం 1](https://www.sakshi.com/gallery_images/2023/07/6/04mdk01-350071_mr.jpg)
మెదక్ మార్కెట్‌లో కూరగాయల విక్రయం
Comments
Please login to add a commentAdd a comment