రమేశ్
చెరువులో మునిగి వ్యక్తి మృతి
చేగుంట(తూప్రాన్): దశదిన కర్మ స్నానం చేసేందుకు చెరువులో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి పడి మృతిచెందాడు. ఈ సంఘటన చేగుంటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన బక్క రమేశ్(28)కు మహేశ్ వరుసకు సోదరుడవుతాడు. ఇతని దశదిన కర్మ కోసం తాను బంధువులతో కలిసి ఊర చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. అలా వెళ్లిన అతడు ప్రమాదవశాత్తు కాలు జారి నీట మునిగి లోపలికి జారుకుపోయాడు. బంధువులు వెంటనే తేరుకొని రమేశ్‌ను రక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి బుజ్జి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరీశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment