సైనికుల్లా పనిచేయండి | Sakshi
Sakshi News home page

సైనికుల్లా పనిచేయండి

Published Thu, May 9 2024 10:25 AM

సైనికుల్లా పనిచేయండి

రేగోడ్‌(మెదక్‌)/టేక్మాల్‌(మెదక్‌): కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి సురేశ్‌ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. రేగోడ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడపగడపకూ వెళ్లి కాంగ్రెస్‌ పథకాలను వివరించాలని సూచించారు. త్వరలో రైతు లకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.7 కోట్లతో బోరంచ ఎత్తిపోతల పథకం ద్వారా రేగోడ్‌ తదితర చెరువులను నింపుతామన్నారు. ఇటీవల రేగోడ్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌ మాజీ ఉద్యోగి రాజశేఖర్‌ కుమారుడు ఆస్పత్రిలో ఉన్న విషయం తెలుసుకుని సొంత డబ్బులతో వైద్యం చేయించినందుకు గాను వారి కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపా రు. అనంతరం బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు మున్నూరు కిషన్‌, మండల పార్టీ అధ్యక్షుడు దిగంబర్‌రావు, గ్రామ అధ్యక్షుడు శంకరప్ప, మాజీ జెడ్పీటీసీ రాజేందర్‌ పాటిల్‌, కో ఆప్షన్‌ సభ్యుడు చోటుమియా, మాజీ సర్పంచ్‌ విజయభాస్కర్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ శ్యాంరావు కులకర్ణి, మాజీ ఎంపీటీసీ నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టేక్మాల్‌ మండలంలోని బొడ్మట్‌పల్లి బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరగా మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యకర్తల సమావేశంలో మంత్రి దామోదర

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement