పటాన్‌చెరుకు ‘మెట్రో’ వరం
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
పటాన్‌చెరు టౌన్: ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడ అయిన పటాన్‌చెరుకు మెట్రో రైలు రాక కోసం ప్రజలు ఎదురు చూశారని, వారి కల నెరవేరిందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ఆది వారం పటాన్ చెరు డివిజన్‌లో బీజేపీ శ్రేణులు నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ, తాను ఎంపీగా పోటీ చేస్తున్న సమయంలో అమీన్‌పూర్‌లో మెట్రో కోసం ఫ్లెక్సీలు పెట్టారని తెలిపారు. పటాన్‌్‌చెరు వరకూ 14.5 కిలో మీటర్లు త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంతో మౌలిక వసతుల కోసం పక్కాగా పనిచేస్తామని వివరించారు. బీహెచ్‌ఈఎల్ చౌరస్తా నుంచి సంగారెడ్డి వరకూ నిర్మించే ఆరు లేన్ల జాతీయ రహదారిని ప్రారంభించేందుకు జనవరిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి రానున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతులు, అభివృద్ధితో అనేక రకాలుగా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు అవుతు ందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి పటాన్‌చెరు డివిజన్ అధ్యక్షుడు నాగసాని నరేష్, ముదిరాజ్, శ్రీనివాస్ గుప్తా, ఎడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment