సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు
కంది(సంగారెడ్డి): రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు చేర్చి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు సూచించారు. ఆదివారం కంది మండలంలోని ఆరుట్లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ప్రతీ రోజు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు పంపాలన్నారు. అవసరమైన గోనె సంచులను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద తాగు నీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. వర్షానికి ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. తేమ శాతం 17 లోపు ఉన్నప్పుడే తూకం వేయడం మంచిదన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment