ఉల్లి ఘాటు తగ్గింది | - | Sakshi
Sakshi News home page

ఉల్లి ఘాటు తగ్గింది

Published Mon, Nov 4 2024 7:20 AM | Last Updated on Mon, Nov 4 2024 7:20 AM

-

జహీరాబాద్‌ టౌన్‌: ఉల్లి ఘాటు కాస్త తగ్గింది. జహీరాబాద్‌ మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి ఉల్లి లోడులు వస్తున్నాయి. దీంతో ఇప్పుడిప్పుడే ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు మహారాష్ట్ర ఉల్లి కేజీ రూ. 60 వరకు ఉండగా, ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ రూ. 25 వరకు పలుకుతుంది. నెల రోజుల వరకు ప్రజలను ఉల్లి ఉక్కిరి బిక్కిరి చేసింది. కానీ ప్రస్తుతం ధర దిగిరావడంతో సామాన్య ప్రజలకు ఊరట లభించింది. టమాట ధర సైతం దిగివస్తుంది. చాలా రోజుల వరకు ట మాట కేజీ రూ. 50 తగ్గలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ రూ. 30కు విక్రయిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement