క్రీడలతో మానసికోల్లాసం
మెదక్ కలెక్టరేట్: క్రీడలు శరీర ధారుఢ్యానికి, మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడుతాయని జిల్లా బ్యాడ్మింటన్ గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పీఎన్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కటకం రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మల్లికార్జున్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం పీఆర్టీయూ నాయకులు వంగ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధు, ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ క్రీడాకారులు వినోద్, ప్రవీణ్, చంద్రశేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment