రైతు సమ్మేళనానికి పటిష్ట ఏర్పాట్లు
కౌడిపల్లి(నర్సాపూర్): ఈనెల 25వ తేదీన తునికి వద్ద గల కేవీకేకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, కేంద్ర మంత్రులు రానుండడంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కేవీకేలో హెలిప్యాడ్, సభా ప్రాంగణ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. అధికారులు, శాస్త్రవేత్తలకు పలు సూచనలు చేశారు. కేవీకే సమీపంలోని గిరిజన రైతుల పంట పొలాల్లో నాలుగు హెలిప్యాడ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. పనులు పూర్తికాగానే క్యూరింగ్ చేయాలని సూచించారు. కాగా కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రవికుమార్ కేవీకేలో జరుగుతున్న ఏర్పాట్లను వివరించారు. సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు సమ్మేళనానికి సుమారు 800 మంది రైతులు రానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్‌అండ్‌బీ ఈఈ సర్ధార్‌సింగ్, కేవీకే శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment