ఉల్లి సాగుకు రైతుల ఆసక్తి
రేగోడ్(మెదక్): ఉల్లి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. యంత్రాలు వచ్చి రోజురోజుకు సాగు పద్ధతులు మారడంతో నూతన విధానం అవలంభిస్తున్నారు. రెయిన్ పైపులతో ఉల్లి పంట సాగు చేస్తూ లాభాలు అర్జిస్తున్నారు. పెట్టుబడితో పాటు పని భారం తగ్గుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 21 మండలాలు ఉండగా 620 ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేశారు. ఒక్క రేగోడ్ మండలంలోనే అత్యధికంగా 540 ఎకరాల్లో సాగు చేసి రికార్డు సృష్టించారు. రేగోడ్, మర్పల్లి, పోచారం, ప్యారారం, టి.లింగంపల్లి, సిందోల్, తాటిపల్లి, గజ్వాడ, దోసపల్లితో పాటు ఆయా తండాల్లో ఉల్లి పంట సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఒక ఎకరాలో ఉల్లి సాగు చేసేందుకు రూ. 80 వేల పెట్టుబడి వచ్చేది. కానీ యాబై శాతం మంది రైతులు రెయిన్ పైపులను ఏర్పాటు చేసుకొని రూ. 20 వేలు పెట్టుబడి భారాన్ని తగ్గించుకుంటున్నారు. పెట్టుబడితో పాటు సమయం, కూలీలకు డబ్బులు, పని భారం తగ్గుతోందని చెబుతున్నారు. మద్ధతు ధర వస్తే తమకు అధికంగా లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 620 ఎకరాల్లో సాగు
ఆధునిక పద్ధతులతో ముందుకు
Comments
Please login to add a commentAdd a comment