సిద్దిపేట కాషాయమయం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 43వ రాష్ట్ర మహాసభలు జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి 25వరకు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన రహదారులలో ఎక్కడ చూసినా ఏబీవీపీ జెండాలు, వాల్‌పోస్టర్‌లు, ఫ్లెక్సీ, తోరణాలతో కాషాయమయంగా మారింది. ఈ మహాసభలకు వివిధ జిల్లాల నుంచి దాదాపు 1,500మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. ఈ మహాసభలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రారంభించి ప్రసంగించనున్నారు. 1949 జూలై 9న కేవలం ఐదు మంది విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు 50 లక్షల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009లో సిద్దిపేటలో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు జరిగాయి. నాడు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఇప్పుడు మళ్లీ ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలకు సిద్దిపేట వేదిక కానుంది.
ఏర్పాట్లు పూర్తి..
రాష్ట్ర మహాసభల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. గవర్నర్‌తో పాటు, కేంద్ర మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొనే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారు. 1500మంది ఏబీవీపీ నాయకులతో పాటు మరో 200 మంది ముఖ్య అతిథులకు మూడు రోజుల పాటుగా భోజనాలు, వసతి సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రత పరంగా పోలీస్‌లు, మున్సిపల్ అధికారులు, విద్యుత్‌శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
మూడు రోజుల పాటు కార్యక్రమాలు..
● సోమవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఏబీవీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆశిష్‌చౌహన్‌లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించనున్నారు.
● మంగళవారం ఏబీవీపీ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం వీరసావర్కర్ చౌరస్తా వద్ద భారీ సభ జరగనుంది. ఈ సభలో ముఖ్య అతిథిగా ఏబీవీపీ నేషనల్ సెక్రటరీ శ్రావణ్‌విరాజ్ హాజరై మాట్లాడనున్నారు.
● బుధవారం గౌరీజీ యువ పురస్కార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తికి రూ.50వేల ప్రైజ్‌మనీతో పాటుగా సన్మానించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయవాది పాల్గొననున్నారు. ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు కేంద్ర మంత్రి పాల్గొననున్నట్లు సమాచారం.
నేటి నుంచి ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు
హాజరుకానున్న
రాష్ట్ర గవర్నర్, కేంద్రమంత్రి
Comments
Please login to add a commentAdd a comment