వనమంతా జనం
కిటకిటలాడిన
ఏడుపాయల
పాపన్నపేట(మెదక్): ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం వేలాది భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఒడి బియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ధర్మసత్రాలు సరిపోక చెట్ల కింద సేద దీరారు. విందు చేసుకొని సాయంత్రం వరకు సరదాగా గడిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈఓ చంద్రశేఖర్, పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment