రికార్డులు ఇవ్వని అధికారులపై చర్యలు
రేగోడ్(మెదక్): సామాజిక తనిఖీ సిబ్బందికి రికార్డులు ఇవ్వని పంచాయతీరాజ్ అధికారులపై చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని అదనపు డీఆర్‌డీఓ రంగాచారి తెలిపారు. రేగోడ్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆదివారం 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక ఏర్పాటు చేశారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో రూ. 4,93,87,743 పనులు చేపట్టారు. ఆయా గ్రామ పంచాయతీల్లో కూలీలకు డబ్బుల చెల్లింపులో రూ. 42 వేల అవకతవకలు జరిగాయని, వీటిని రికవరీ చేస్తామని చెప్పారు. ఈజీఎస్ సిబ్బందికి రూ. 29 వేల జరిమానా విధించామన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ఉపాధి పనులు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సీతారావమ్మ, ఎస్‌టీఎం దత్తు, హెచ్‌ఆర్ మేనేజర్ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఆర్‌పీ జీవన్, ఏపీఓ జగన్మోహన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సింగూరు యాసంగి
ప్రణాళిక ఏదీ?
మెదక్‌మున్సిపాలిటీ: సింగూరు నుంచి యాసంగికి విడుదల చేసే నీటి ప్రణాళికను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం శాసనమండలిలో ఆయన మా ట్లాడుతూ.. వనదుర్గా భవాని ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ ఇంతవరకు యాసంగి నీటి ప్రణాళిక విడుదల చేయలేదన్నారు. దీంతో సుమారు 30 వేల ఎకరాల సాగు చేసే రైతులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నీటి విడుదలకు సంబంధించిన ప్రణాళికను వెంటనే విడుదల చేయాలని కోరారు.
మా సమస్యలు
పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 13వ రోజుకు చేరుకుంది. సమ్మెలో ఉద్యోగులు తమ పిల్లలతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, రాజశేఖర్, సంపత్, రమేష్, కవిత తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం విరాళాల సేకరణ
మెదక్ కలెక్టరేట్: వచ్చే ఏడాది జనవరి 25వ తేదీ నుంచి 28 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న సీపీఎం రాష్ట్ర మహాసభలకు కార్మికులు విరివిగా విరాళాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం కోరారు. ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో మహాసభల నిర్వహణ కోసం మెదక్‌లో విరాళాల సేకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటిసారిగా ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణంలో సీపీఎం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బసవరాజు, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంతో పాటు నస్కల్ గ్రామ పరిధిలోని సబ్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ గణేష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్‌స్టేషన్లలో మరమ్మతులు చేయనున్నట్లు చెప్పారు. వినియోగదారులు గమనించి విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment