ప్రజావాణికి 59 వినతులు
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణికి వినతులు వెల్లువెత్తా యి. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి 59 వినతులు రాగా.. అందులో ధరణి (20), రుణమాఫీ (10), డబుల్‌బెడ్రూం (3)తో పాటు ఇతర సమస్యలపై మరో 26 అర్జీలు వచ్చాయి. వాటిని పరిశీలించిన అదనపు కలెక్టర్ తక్షణం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని మెదక్ పట్టణానికి చెందిన చౌదరి యాదగిరి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రోగులకు సరిగా మందులు ఇవ్వడం లేదని, బాత్రూంలకు తలుపులేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ల్యాబ్‌లో పనిచేసే సిబ్బందికి కనీసం పేర్లు చదవడం, రాయడం కూడా రావడం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment