డ్రగ్స్ రహిత జిల్లాయే లక్ష్యం: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: డ్రగ్స్ రహిత జిల్లాయే ప్రధాన లక్ష్యమని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికారులు, సిబ్బంది వాహనాలు తనిఖీ నిర్వహించే సమయంలో అనుమానం ఉన్న వ్యక్తులను నార్కోటిక్ డ్రగ్స్ కిట్స్ ద్వారా పరిశీలించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా గుర్తించిన బ్లాక్ స్పాట్లలో తనిఖీలు నిర్వహించినప్పుడు తప్పకుండా వీటిని ఉపయోగించాలన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలన్నారు. మాదకద్రవ్యాల విషయంలో ఎంత పెద్ద వారు ఉన్న ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డ్రగ్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ మధుసూదన్‌గౌడ్, కానిస్టేబుల్ నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment