ధాన్యం కొనాలని ఆందోళన
చిన్నశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోలు చేయాలంటూ మండలంలోని కొర్విపల్లి రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం గ్రామంలోని మెదక్– చేగుంట ప్రధాన రహదారిపై ధాన్యం పోసి నిరసన చేపట్టారు. 20 రోజుల కిత్రం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చామని, కాంటా పెట్టాలని కోరుతున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సుమారు గంటకుపైగా ధర్నా కొనసాగింది. పోలీసులు రైతులను సముదాయించారు.
Comments
Please login to add a commentAdd a comment