సమగ్రంగా కుటుంబ సర్వే
కలెక్టర్ రాహుల్‌రాజ్
టేక్మాల్(మెదక్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేను క్షేత్రస్థాయిలో పూర్తిగా సమగ్రంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని కోరంపల్లిలో సర్వే తీరును పరిశీలించి మాట్లాడారు. సర్వే కోసం వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలని కోరారు. సర్వే ద్వారా సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచుతామని, ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సరైన సమాచారం ఇస్తే భవిష్యత్‌లో వివిధ సంక్షేమ పథకాలకు ఉపయోగపడేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈనెల 8వ తేదీ వరకు ఇళ్లను సందర్శించి జాబితాను రూపొందిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో సర్వేపై అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీఓ విఠల్, ఆర్‌ఐ సాయిశ్రీకాంత్ పాల్గొన్నారు.
కొనుగోళ్లలో నిర్లక్ష్యం తగదు
ధాన్యం కొనుగోలులో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ సూచించారు. బుధవారం మండలంలోని ఎల్లుపేట కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఓ శ్రీనివాసరావుతో కలిసి సందర్శించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని సాధించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. తూకం విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం సేకరించిన 15 రోజుల్లోగా సంబంధిత రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలన్నారు. అనంతరం టేక్మాల్ పశువైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు, మందులను పరిశీలించి పశువులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment