కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
చిలప్‌చెడ్(నర్సాపూర్): రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం మండలంలోని చండూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడా రు. జిల్లాలో ఇప్పటివరకు 2,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. సేకరించిన ధాన్యం ప్రతి రోజు మిల్లులకు తరలించాలన్నారు. అనంతరం చిలప్‌చెడ్‌లో ఇంటింటి సర్వేను పరిశీలించారు. జిల్లాలో ఇంటింటి కుటుంబ సర్వే సమర్థవంతంగా జరుగుతుందన్నారు. సర్వే వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రజలకు చెప్పాలని సిబ్బందికి సూచించారు. ఈనెల 9వ తేదీ నుంచి ప్రతి కుటుంబం యొక్క వివరాలను నమోదు చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముసాధిక్, డీఎల్‌పీఓ సాయిబాబా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment