సైబర్ కేటుగాళ్లతో జరభద్రం
అదనపు ఎస్పీ మహేందర్
మెదక్ మున్సిపాలిటీ: సైబర్ కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నా రు. బుధవారం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సీనియర్ సిటిజన్లు, విశ్రాంత ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులు అధికంగా ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని, ఓటీపీ చెప్పమని అడిగితే చెప్పకూడదన్నారు. కొన్ని నెలలుగా నమోదవుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే బాధితుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారని వివరించారు. వారిని చైతన్యపరిచేందుకు సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించినట్లు చెప్పారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ నాగరాజు, సైబర్ సెక్యూరిటీ కానిస్టేబుల్ కార్తీక్, విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షుడు జగదీష్, కోశాధికారి, గోలి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment