వెల్దుర్తి(తూప్రాన్): నర్సింగ్‌హోంలు, ఆర్‌ఎంపీ కేంద్రం నిర్వహణలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ రమ హెచ్చరించారు. ఈమేరకు బుధవారం మండల కేంద్రంలో నర్సింగ్‌హోంలు, ఆర్‌ఎంపీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యుల వివరాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, బయో వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తిరుమల ప్రాథమిక చికిత్స కేంద్రంలో ప్రథమ చికిత్సకు బదులు బెడ్లు వేసి వైద్యం అందిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బెడ్‌లు తొలగించి కేవలం ప్రాథమిక చికిత్స అందించాలని ఆదేశించారు.
చెకుముకి సంబరాలకు సిద్ధం
గజ్వేల్: తెలంగాణ ప్రభుత్వ సమగ్ర శిక్ష సహకారంతో జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యంలో గురువారం నుంచి రాష్ట్రస్థాయిలో పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జేవీవీ రాష్ట్ర కార్యదర్శి మహేంద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు బాలరాజు, జిల్లా అధ్యక్షుడు తుమ్మ సత్యం, ప్రధాన కార్యదర్శి కనకరాజులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment