నకిలీ విత్తనాలను అరికట్టాలి
మెదక్‌జోన్: ప్రైవేట్ విత్తన కంపెనీలు విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నాయని, వాటిని అరికట్టాలని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యవ సాయ, హార్టికల్చర్, పీఏసీఎస్ చైర్మన్లతో సమావే శం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రయోజనాలు కాపాడేందుకే విత్తనా భివృద్ధి సంస్థ పనిచేస్తుందన్నారు. రాబోయే యా సంగి సీజన్‌లో సబ్సిడీ విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యతలేని విత్తనాలు అమ్మే ప్రైవేట్ కంపెనీలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. సొసైటీలు, ఆగ్రోస్‌ల ద్వారా విత్తనాలు విక్రయిస్తామని పేర్కొన్నారు. విత్తన చట్టంలో మార్పులు తెస్తామని, ప్రస్తుతం ఉన్న చట్టం రైతంగానికి వ్యతిరేకంగా ఉందన్నారు. మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలను తమ కార్పొరేషన్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట వ్యవసాయ అధికారులు గోవింద్, శివప్రసాద్, రాధిక, డీసీఓలు కరుణ, కిరణ్‌కుమార్, నాగేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్లు హనుమంత్‌రెడ్డి, అనంతరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ మేనేజర్లు సంధ్య, రాజు, కోటిలింగం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థకార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment