వనభోజనాలతో ఆత్మీయత
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
పటాన్చెరు టౌన్: కార్తీక మాసంలో ఆత్మీయత వెల్లిరిసేందుకే వనభోజన కార్యక్రమాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం మైత్రీ మైదానంలో శ్రీకృష్ణదేవరాయ కార్తీక వనభోజనాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనభోజనాల నిర్వాహకులు కేంద్ర సహాయక మంత్రిని సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, మున్నూరు కాపు సంఘం పెద్దలు భిక్షపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment