కొనుగోలు ప్రక్రియ వేగిరం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు ప్రక్రియ వేగిరం చేయాలి

Published Wed, Nov 20 2024 7:56 AM | Last Updated on Wed, Nov 20 2024 7:56 AM

కొనుగ

కొనుగోలు ప్రక్రియ వేగిరం చేయాలి

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌

నర్సాపూర్‌ రూరల్‌: ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌ రావు నిర్వాహకులకు సూచించారు. మంగళవారం సాయంత్రం మండలంలోని చిన్నచింతకుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని సూచించారు. లారీలు రైస్‌మిల్‌ల వద్ద వెనువెంటనే ఖాళీ అయ్యేలా చూడాలని తెలిపారు. సన్నరకం ధాన్యం కొనుగోలు సైతం వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం గౌరీశంకర్‌, సీసీ ప్రవీణ, నాగరత్న, లక్ష్మి, గ్రామ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

సమగ్ర శిక్షా

ఉద్యోగుల సమ్మె నోటీసు

మెదక్‌ కలెక్టరేట్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీ విస్మరించి అన్యాయం చేస్తోందని సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డీఈఓ రాధాకిషన్‌ను కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులరైజ్‌, అన్ని బెనిఫిట్స్‌ అందజేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా సమస్యలపై ఊసెత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల్లో ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని లేనిపక్షంలో నిరవధిక సమ్మె చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి పాషా, కోశాధికారి సంపత్‌, ఆంజనేయులు, గట్టయ్య, రాజు, కనకరాజు, శ్రీకాంత్‌, మహేశ్‌, చందు పాల్గొన్నారు.

నర్సాపూర్‌ వాసికి డాక్టరేట్‌

నర్సాపూర్‌: అమెరికన్‌ యూనివర్శిటీ నుంచి డాక్టరేట్‌ పొందానని నర్సాపూర్‌కు చెందిన జహీర్‌ ఇక్బాల్‌ తెలిపారు. సోమవారం రాత్రి చైన్నెలో జరిగిన ఓ కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారన్నారు. తాను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను వర్సిటీ వారు గుర్తించి డాక్టరేట్‌ ఇచ్చాన్నారు.

మత్స్యకారులఅభ్యున్నతి కోసం కృషి

జిల్లా మత్స్యశాఖ అఽధికారి మల్లేశం

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై అందజేస్తున్న చేప పిల్లలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని జిల్లా మత్స్యశాఖ ఏడీ మల్లేశం అన్నారు. మంగళవారం బూర్గుపల్లి శ్రీపతి చెరువులో ప్రభుత్వం పూర్తి సబ్సిడీపై అందజేస్తున్న చేప పిల్లలను ఆయన వదిలారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవనోపాధిని పొందాలన్నారు. గ్రామ ముదిరాజ్‌ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.

క్రిమినల్‌ కేసులు

నమోదు చేస్తాం

జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రీరామ్‌

వెల్దుర్తి(తూప్రాన్‌): ఆర్‌ఎంపీల ముసుగులో ప్రాథమిక చికిత్సే చేయాలని, అంతకు మించి సేవలు అందిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్‌ హెచ్చరించారు. నర్సింగ్‌ హోమ్‌లు, ఆర్‌ఎంపీ కేంద్రాల్లో ప్రాథమిక చికిత్సకు బదులు ఇతర వైద్యం అందిస్తున్నట్లు దృష్టికి వచ్చిందని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జ్ఞానేశ్వర్‌ను ఆదేశించారు. నిబంధనలు పాటించడం లేదని గుర్తించి నోటీసులు అందజేసినా ఎటువంటి మార్పు కనిపించడంలేదన్నారు. మంగళవారం సాయంత్రం వెల్దుర్తి ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వెల్దుర్తి హాస్పిటల్‌లో గతంలో డెలివరీలు చాలా జరిగేవన్నారు. ప్రస్తుతం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయన్నారు. ఈ సంఖ్య తిరిగి యథాస్థితికి తెచ్చేలా మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జనవరి నుంచి అడల్ట్‌ టీబీ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రాం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కొనుగోలు ప్రక్రియ వేగిరం చేయాలి  
1
1/1

కొనుగోలు ప్రక్రియ వేగిరం చేయాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement