లోక రక్షకా వందనం
మెదక్ చర్చిలో అంబరాన్నంటిన క్రిస్మస్, శతాబ్ది సంబరం●
● ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వేలాది మంది భక్తులు ● ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరాధన ● దైవసందేశం ఇచ్చిన ఇన్‌చార్జి బిషప్ రూబెన్‌మార్క్
పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు
మెదక్‌జోన్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చి బుధవారం ఏసయ్య నామస్మరణతో మారుమోగింది. శతాబ్ది ఉత్సవాలతో పాటు క్రిస్మస్ వేడు కలు అంబరాన్నంటాయి. ఉదయం 4.30 గంటలకు మతపెద్దలు చర్చి చుట్టూ శిలువను ఊరేగించి మొదటి ఆరాధనను ప్రారంభించారు. తెల్లవారుజామున వేలాది మంది భక్తులనుద్దేశించి ఇన్‌చార్జి బిషప్ రూబెన్‌మార్క్ దైవసందేశం ఇచ్చారు. అనంతరం చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి శాంతయ్య దైవసందేశం వినిపించారు. రెండవ ఆరాధనను ఉదయం 10 గంటలకు ప్రారంభించారు.
భక్తులను అడ్డుకున్న పోలీసులు
సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు మెదక్ చర్చికి రావాల్సి ఉండగా.. సమయానికి రాలేకపోయారు. మధ్యా హ్నం 12 గంటల నుంచి సీఎం వచ్చే వరకు అనగా మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీసులు భక్తులను చర్చిలోనికి అనుమతించలేదు. అతి కొద్దిమందిని మాత్రమే చర్చిలో కూర్చొబెట్టి మిగితా వారిని లోనికి పంపించలేదు. చర్చికి మూడు ద్వారాలు ఉండగా, ప్రధాన ద్వారం వద్ద పోలీసులు ఎవరూ లోనికి వెళ్లకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. మరో రెండు ద్వారాలను మూసివేశారు. దీంతో భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. కనీసం మీడియాకు సైతం అనుమతి ఇవ్వలేదు. అరగంటకోసారి నిర్వహించిన ఏసయ్య కీర్తనలు ఆకట్టుకున్నాయి.
మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలతో పాటు క్రిస్మస్ వేడుకలకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. వారికి ఇబ్బంది కలగకుండా చర్చి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. చర్చి ఎదుట పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి భక్తులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. తప్పిపోయిన పిల్లలను మైకు ద్వారా పిలిచి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా చర్చి నిర్మాణదాత చార్లెస్ వాకర్ రక్త సంబంధీకులు మనవలు, ముని మనవలు వేడుకలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment