రూ. 192 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
జిల్లాలో రూ.192 కోట్ల అంచనా వ్యయం కలిగిన పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈపనులకు సంబంధించి ఏడుపాయల ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలాలను మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. రూ. 52.76 కోట్లతో వివిధ గ్రామాలను అనుసందానిస్తూ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ. ఐదు కోట్లతో ఇందిరా మహిళాశక్తి భవన నిర్మాణం, రూ. 35 కోట్లతో ఆలయం వద్ద రోడ్డు విస్తరణ, డివైడర్ల నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి రూ. వంద కోట్ల చెక్కును పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment