తల్లీబిడ్డలకు మెరుగైన సేవలు
అక్కన్నపేట(హుస్నాబాద్): ఆస్పత్రికి వచ్చే తల్లీబిడ్డలకు మెరుగైన సేవాలు అందించాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ బీ రవీందర్‌నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పల్వన్‌కుమార్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఓపీ రిజిస్టర్, ఫార్మసీ స్టోర్, లేబొరేటరి, వార్డులను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులతో ప్రేమతో మాట్లాడి ఉత్సాహపరిచి వ్యాధులను నయం చేయాలన్నారు. అన్ని పీహెచ్‌సీలో సాధారణ ప్రసవల సంఖ్య పెంచాలన్నారు. గర్భిణులను 102 వాహనం ద్వారా ట్యాగ్ సెంటర్లకు తీసుకొచ్చేలా ఆశా కార్యకర్తలు చూడాలన్నారు. మహిళా క్లినిక్‌ల ద్వారా మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేకశ్రద్ధ వహించాలన్నారు. అన్ని ఆరోగ్య కార్యక్రమాల పనితీరును హెచ్‌ఐఎఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేసుకోవాలన్నారు. డయాబెటీస్ బాధితులకు మొదటి మూడు నెలలపాటు పరీక్షలు నిర్వహిస్తూ సూచనలు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment