మన్మోహనుడి ‘భూ పట్టాల’ జ్ఞాపకం
మెదక్‌జోన్: భూమి లేని నిరుపేదలకు అసైన్డ్‌మెంట్ భూముల పంపిణీ పథకాన్ని 2005లో అప్పటి సీఎం మహానేత రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. భూ పంపిణీ కార్యక్రమాన్ని 2005 ఆగస్టు 21వ తేదీన మెదక్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 23 వేల పైచిలుకు నిరుపేదలకు భూ పట్టాలను పంపిణీ చేశారు. పట్టాలు పొందిన ఎంతో మంది కూలీ లు ప్రస్తుతం రైతులుగా మారారు. ఇందులో అత్యధికంగా గిరిజనులు లబ్ధిపొందారు. కాగా మన్మోహన్‌సింగ్ మృతి చెందటంతో ఆనాటి జ్ఞాపకాలను జిల్లా ప్రజలు నెమరువేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment