12 మంది నోడల్ అధికారులు
పంచాయతీ ఎన్నికలకు కసరత్తు
సంగారెడ్డి జోన్: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా 12 మంది అధికారులను నియమిస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో అంశంపై ఒక్కో అధికారిని నియమించి పర్యవేక్షించేలా బాధ్యతలను అప్పగించారు. కోడ్ అమలు, సామగ్రి, అభ్యర్థుల ఖర్చు, ఫిర్యాదుల స్వీకరణ, నిర్వహణకు సిబ్బంది నియామకంతో పాటు తదితర అంశాలను వారు పర్యవేక్షిస్తారు. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినా.. విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మున్సిపాలిటీలలో విలీనం అయిన పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో విలీనం అయిన ఒక పంచాయతీతో కలిపి 646 గ్రామ పంచాయతీలు, 5,718 వార్డులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వార్డులతో పాటు ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే 650 కంటే ఎక్కువగా ఉంటే మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో 5,778 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ప్రస్తుతం 5,732 పోలింగ్ కేంద్రాలను గుర్తించి, జాబితాను విడుదల చేశారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాలలో మొత్తం 8,51,420 మంది ఓటర్లు ఉండగా మహిళలు 4,27,739 మంది ఉండగా, పురుషులు 4,23,629, ఇతరులు 52 మంది ఉన్నారు. గత నెలలో తుది ఓటరు జాబితాను విడుదల చేశారు.
నోడల్ అధికారుల వివరాలు
నోడల్ అధికారి పేరు హోదా అంశం
వెంకటేశ్వర్లు జిల్లా విద్యాధికారి సిబ్బంది నియామకం, నిర్వహణ
అఖిలేష్‌రెడ్డి జిల్లా ఎస్సీ అభివృద్ది అధికారి బ్యాలెట్ బాక్స్
వెంకటరమణ డిప్యూటి కమిషనర్ ట్రాన్స్‌పోర్టు ట్రాన్స్‌పోర్ట్
ఎస్‌బీ రామాచారి ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు
శ్రీనివాస్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారి మెటీరియల్ పంపిణీ
జానకి రెడ్డి జిల్లా పరిషత్ సీఈఓ ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఖర్చులు
కిరణ్‌కుమార్ కోపరేటివ్ అధికారి వ్యయ పరిశీలన
జగదీశ్ బీసీ సంక్షేమాధికారి ఎన్నికల అబ్జర్వర్
బాల్‌రాజ్ అడిషనల్ డీఆర్‌డీఏ బ్యాలెట్ పత్రాలు
ఏడుకొండలు డీపీఆర్‌ఏ మీడియా కమ్యూనికేషన్
గీత పీడీ మెప్మా హెల్ప్‌లైన్, ఫిర్యాదుల కేంద్రం
సాయిబాబా జిల్లా పంచాయతీ అధికారి ఎన్నికల రిపోర్టులు, రిటర్న్స్
ఇటీవల పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
ఓటరు జాబితా సైతం సిద్ధం
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment